బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి మరో సిట్టింగ్ ఎంపీ?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా కీలక నేతలంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా కీలక నేతలంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి చేరుతుండగా.. మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరగా.. మరో ఎంపీ రాములు బీజేపీలో చేరారు. తాజాగా.. గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. మరో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
బహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీబీ పాటిల్ మంతనాలు జరిపారు. చర్చలు సఫలం అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, బీబీ పాటిల్ జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం మొండిచేయి చూపడంతో ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు.