Big Breaking: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు IMD అలర్ట్.. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి.

Update: 2024-08-31 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

అలాగే ఏపీ లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని… ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


Similar News