BIG BREAKING: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం సాయంత్రం విడుదల చేసింది.

Update: 2024-07-08 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అయితే, 2023 సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు కంప్యూటర్‌ బేస్ పరీక్షను నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలో అభ్యర్థులు సాధించిన మార్కులను ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. కాగా, ఓ అభ్యర్థి ఫలితాన్ని విత్‌హెల్డ్‌లో పెట్టినట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. 1:2 నిష్పత్తిలో షార్ట్‌ లిస్టు జాబితాను కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్‌ లిస్ట్ చేయనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.


Similar News