భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐడబ్ల్యూలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నలకు కస్టడీ విధించింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు వారిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఇదే కేసులో ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ప్రణీత్ రావును 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ప్రణీత్ రావు చంచల్ గూడ జైలులో ఉన్నారు. మరో వైపు ప్రణీత్ రావు సోమవారం తన బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.