ఆఫ్ట్రాల్ ఢిల్లికి పిలిస్తే భయపడతామా? రేవంత్ రెడ్డికి నోటీసులపై భట్టి రియాక్షన్

సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-05-04 09:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చివేసి రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతోందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్పిన విషయాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని దీనిపై తప్పుడు కేసులు పెట్టి ఢిల్లీకి పిలిపిస్తారా? మీరు ఢిల్లీకి పిలిపిస్తే కాంగ్రెస్ నాయకత్వం భయపడుతుందనుకుంటే అది చాలా పొరపాటు అని హెచ్చరించారు. శనివారం కొత్తగూడెం కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడిన భట్టి.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ నోటీసుల అంశంపై స్పందించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికే ఎదురు నిలబడి తుపాకి గుళ్లకు గుండెలు అడ్డుచూపిన చరిత్ర కాంగ్రెస్ నాయకత్వానిదని.. మా ముఖ్యమంత్రిని మీరు ఆఫ్ట్రాల్ ఢిల్లీకి పిలిపిస్తే భయపడుతుందనుకోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం తప్పని సరిగా పోరాటం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన నినాదానికి యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పథకాలు అందిస్తూనే ఉంటుందన్నారు. ఖమ్మంలో థర్మల్ పవర్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువస్తామని సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నామన్నారు. కొత్తగూడెం స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.

Read More..

భట్టి విక్రమార్క గట్టోడు.. CM రేవంత్ రెడ్డి ప్రశంస 

Tags:    

Similar News