Bhatti Vikramarka : హూవర్ డ్యామ్ ను సందర్శించిన భట్టి విక్రమార్క

అమెరికా పర్యటనలో ఉన్న భట్టి విర్కమార్క హూవర్ డ్యామ్ ను సందర్శించారు.

Update: 2024-09-26 06:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ తాజాగా నెవాడా, అరిజోనా రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉన్న హూవర్ డ్యామ్ ను డి సందర్శించారు. ఫెడరల్ ప్రభుత్వ అధికార బృందం ఆధ్వర్యంలో ఈ సందర్శన కొనసాగింది. డ్యామ్ లో నీటి నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి యంత్రాంగం, నిర్మాణ వ్యవస్థ, భద్రతా చర్యలను డిప్యూటీ సీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా డ్యామ్ నిర్మాణ చరితను భట్టి తెలుసుకున్నారు.తె లంగాణలోని జల విద్యుత్ ప్రాజెక్టులను మెరుగుపరచడానికి హూవర్ డ్యామ్ వద్ద అనుసరిస్తున్న మెరుగైన విధానాలను మన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వర్తింపజేస్తామన్నారు.


Similar News