Bhatti: నగరం నడిబోడ్డున పాపన్న గౌడ్ విగ్రహాం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
నగరం నడిబోడ్డున పాపన్న గౌడ్ విగ్రహాం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఆయన పుట్టిన సర్వాయి పేట, కిలాశాపూర్ లను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నగరం నడిబోడ్డున పాపన్న గౌడ్ విగ్రహాం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఆయన పుట్టిన సర్వాయి పేట, కిలాశాపూర్ లను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అధికారికంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రాలనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం తరుపున ఈ వేడుకలు నిర్వహించడం.. బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ది, నిబద్దతను తెలియజేస్తుందని అన్నారు. బలహీన వర్గాలు ఏం సాధించలేరన్న ఆత్మన్యూనత భావంలో ఉన్న వారికి పాపన్న జీవితం స్పూర్తిదాయకమని అన్నారు. బలహీన వర్గాలకు సందేశం ఇచ్చేందుకే ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
పాపన్న గురించి అందరికీ తెలిసేలా ఆయన పుట్టిన సర్వాయి పేట సహా పక్కన ఉన్న కిలాశాపూర్ ను పర్యాటకంగా అభివృద్ది పరచడానికి ప్రభుత్వం టూరిజం శాఖ తరుపున 4 కోట్ల 70 లక్షల రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చే యడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరపడానికి కృషి చేసిన పొన్నం ప్రభాకర్ ను అభినందించారు. అలాగే పాపన్న జీవిత చరిత్రకు సంబందించి పాకెట్ పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతీ గ్రామానికి పంచి పెట్టేందుకు ప్రభుత్వం నుంచి కొంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. సామన్యులనే సైనికులుగా మార్చి కోటలు బద్దలు కొట్టి బయటకి వచ్చి.. ఒక్క భువనగిరి కోటనే కాదు ఏకంగా గోల్కొండ కోటనే కొల్లగొట్టిన సర్వాయిపాపన్న జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. అలాగే పాపన్న జీవితం ఈనాటి ఇందిరమ్మ రాజ్యానికి కూడా ఆదర్శమేనని చెప్పారు.
వారి ఆలోచనలకు అనుగునంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయడమే కాకుండా బడ్జెట్ వారికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పిల్లలను విద్యతోనే ప్రయోజకులను చేయవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, అలాగే గ్రామీణ విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా ప్రతీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నగరం నడిబోడ్డున పెట్టాలని చాలా మంది అడుగుతున్నారని, ఈ బాధ్యతలు పొన్నం ప్రభాకర్ కి అప్పగిస్తున్నామని, దీనికి సంబందించిన స్థలం చూసి, దానికి కావల్సిన ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం కూడా ఇదేనని, పాపన్న ఆలోచనలే ఈ ప్రభుత్వం ఆలోచనలుగా ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పారు.