భారత్ బయోటెక్ అధిపతి కృష్ణ ఎల్లాకు డీన్స్ మెడల్
దిశ, నేషనల్ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కరోనా కష్టకాలంలో కొవాగ్జిన్ టీకాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది.
దిశ, నేషనల్ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కరోనా కష్టకాలంలో కొవాగ్జిన్ టీకాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఎన్నో ప్రపంచ దేశాలకు చౌక ధరకే కరోనా టీకాలను భారత్ బయోటెక్ సప్లై చేసింది. ఈ సేవా ప్రస్థానం నేపథ్యంలో భారత్ బయోటెక్ కో ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్లాను జాన్స్ హోప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్‌కు చెందిన అత్యున్నత పురస్కారం ‘డీన్స్ మెడల్’ వరించింది. ఆరోగ్య రంగంలో అందించిన విశిష్ఠ సేవలకుగానూ కృష్ణ ఎల్లాకు ఈ అవార్డును అందజేశామని జాన్స్ హోప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది. బ్లూమ్‌బర్గ్ స్కూల్ స్నాతకోత్సవం సందర్భంగా డీన్ ఎల్లన్ జే మెకంజీ ఈ అవార్డును కృష్ణ ఎల్లాకు ప్రదానం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఆయన పాత్ర అనిర్వచనీయమైందని కొనియాడారు. కొవిడ్ సమయంలో కొవాగ్జిన్‌తో వారు చేసిన సేవలను ప్రశంసించారు.