రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు.

Update: 2024-09-23 06:30 GMT

దిశ, ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు. దిశ దినపత్రికలో గత రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి పై కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. ఆసుపత్రి పనితీరు పై సోమవారం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో ఏ ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నారు. డాక్టర్లు ఎంత మంది ఉన్నారు, ఏ రోస్టర్ ప్రకారంగా అందుబాటులో ఉంటున్నారని అనే విషయం పై కలెక్టర్‌కు వివరించారు. కాగా ఆసుపత్రిలో ప్రతి రోజూ శానిటేషన్ వ్యవస్థ పై తనిఖీలు చేయాలని ఆదేశిస్తూ.. ఆస్పత్రిలో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు.


Similar News