బీసీ కమిషన్ నియామక నోటిఫికేషన్ సవరించాలి : ఎమ్మెల్సీ బండ ప్రకాశ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కులగణన చేయడం హర్షణీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు.

Update: 2024-10-20 08:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కులగణన చేయడం హర్షణీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. అయితే బీసీ కమిషన్ నియామక నోటిఫికేషన్ లో డెడికేటెడ్ కమిషన్ అని పేర్కొనడం జరిగిందని, అది మార్పు చేయాలని, ఏ చిన్న తప్పు దొరికినా మళ్ళీ కుల గణన పెండింగ్ లో పడే అవకాశం ఉందని బండ ప్రకాశ్ కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణనకు మద్దతుగా నిర్వహింనిన అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుంటుంబ సర్వేలో కోటి 50 లక్షల మంది బీసీలు ఉన్నట్టు తెలిసిందని, కమిషన్ సభ్యులు కూడా అందరినీ కలుపుకొని మీటింగ్ పెడుతున్నారని, అయితే కుల గణన ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.

స్థానిక సంస్థలలో 42 % బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన మాట అమలు చేయాలని, రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. 300 నుండి 400 ర్యాంకు వచ్చిన బీసీలకు ఉద్యోగం రావడం లేదని, 1500 ర్యాంకు వచ్చిన వారికి ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ లో ఉద్యోగం వస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ లో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కోసం పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. తమిళనాడులో బీసీ, ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్స్ అమలు చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా బీసీలకు దక్కల్సాన రిజర్వేషన్ల వాట సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.


Similar News