‘గ్రూప్-1 పరీక్షల పై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు’.. ఎమ్మెల్సీ కోదండరాం సంచలన వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు.

Update: 2024-10-20 12:05 GMT
‘గ్రూప్-1 పరీక్షల పై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు’.. ఎమ్మెల్సీ కోదండరాం సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని ఆయన ఫైరయ్యారు. నేడు(ఆదివారం) నిజామాబాద్‌లో నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ 1 పరీక్షల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక పోయింది అన్నారు. గ్రూప్-1 పరీక్షల పై బీఆర్‌ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు, ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ పై ఎన్ని సార్లు వివరాలు అడిగిన ఇవ్వలేదని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందన్నారు. జీవో 55, 29 అమలు వెనుక కోర్టు సూచనలున్నాయని ఈ విషయం విపక్షాలు తెలుసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎప్పుడైనా నిరుద్యోగ సమస్యల పై పోరాడుతూనే ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ మీద బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. నిరుద్యోగులను విపక్షాలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం మండిపడ్డారు.

Tags:    

Similar News