టీటీడీ బోర్డులో బంజారాలకు అవకాశమివ్వాలి: ఎంపీ బలరాం నాయక్

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డులో బంజారాల(Banjara)కు అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)ను మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్(MP Balram Naik) కోరారు.

Update: 2024-11-01 06:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డులో బంజారాల(Banjara)కు అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)ను మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్(MP Balram Naik) కోరారు. నేడు తిరుమల శ్రీవారిని బలరాం నాయక్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. హథీరాంజీ మఠానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. వీటి రక్షణకు హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హథీరాంజీ మఠంలో బంజారాలకు వసతులు కల్పించాలని, మఠం పర్యవేక్షణకు బంజారాలతో కమిటీ వేయాలని కోరారు.

టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశమివ్వడం పట్ల ధన్యవాదాలన్నారు. బోర్డులో బంజరాలకు ఎవరికి అవకాశమిచ్చిన సరేనని, వీలైనంత త్వరగా బంజారాను బోర్డు సభ్యుడిగా నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. 

Tags:    

Similar News