రేవంత్ రెడ్డిని గొప్పనాయకుడన్న పవన్ కల్యాణ్.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే!
అల్లు అర్జున్(Allu Arjun) కేసు అంశంపై తొలిసారి మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) కేసు అంశంపై తొలిసారి మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. కింద నుంచి ఎడిగారు. ఒక్కో మెట్టు కష్టంగా ఎక్కుతూ పైకొచ్చారు. చిన్న చిన్న విషయాలను అత్యుత్సాహం ప్రదర్శించే వ్యక్తి కాదు అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాజాగా.. రేవంత్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరెలా? స్పందిస్తారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ను మీడియా ప్రతినిధులు సోమవారం ప్రశ్నించారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ.. ‘పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు. నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే ఆయనలో ఏం కన్పించిందో అన్నారో తెలియదు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు.
ఏడాదిలో క్రైమ్ రేటు పెరిగింది. ఇలాంటి వ్యక్తి పవన్ కల్యాణ్‌కు ఎలా గొప్పగా కనిపించారో తెలియడం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు వెళ్లి రావడంతో సమస్య ముగిసింది. మళ్లీ దీనిపై అసెంబ్లీ చర్చ పెట్టడం అనవసరం. ఆరు గ్యారంటీల అమలుపై చర్చ పెట్టాలి. అమలు చేయలేక.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అల్లు అర్జున్‌ను పావులా వాడారని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కు మధ్య ఏదో చెడిందని అనుమానం వ్యక్తం చేశారు. రేవతి భర్త కేసు వాపస్ తీసుకుంటానని ప్రకటించినా.. ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. ముందు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
Read More ...
MP Chamala: బన్నీపై పవన్ కళ్యాణ్ వాస్తవం మాట్లాడారు.. ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్