'టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం లేదు'

కేసీఆర్ పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-09-09 06:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారత రాజ్యాంగంలోని ఆదర్శాలను అమలు చేయాలని, రాజ్ భవన్‌ను గౌరవించి ప్రోటోకాల్ పాటించాలని గవర్నర్ కోరితే ఆమెపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం గానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాటించడం లేదని ధ్వజమెత్తారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కల్వకుంట్ల రాజ్యాంగం ప్రతిపాదకుల నుంచి మనం ఇంకా ఏం ఆశించగం అంటూ ఎద్దేవా చేశారు. కాగా గవర్నర్‌గా తాను బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో జరిగినన కార్యక్రమంలో తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని కనీసం పలకరింపు కూడా లేదని అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా చేయడం వంటి అన్ని అంశాలను ఆమె ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తమిళిసై తీరును టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఆమె బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయగా ఇవాళ స్పందించిన బండి సంజయ్ టీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. కల్వకుంట్ల రాజ్యాంగ కర్తల నుండి ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Also Read : ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్.. ఇకపై మరింత కాస్ట్లీగా KCR పర్యటన

Tags:    

Similar News