మాథ్స్, సైన్స్ పేపర్ లీక్ చేసినా నాకు పేరు వచ్చేది..! బండి సంజయ్ సంచలన కామెంట్స్ (వీడియో)

గతంలో టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ ఆరోపణలతో ఎంపీ బండి సంజయ్‌పై గత ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-01-29 08:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ ఆరోపణలతో ఎంపీ బండి సంజయ్‌పై గత ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా బండి సంజయ్ స్పందిచారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హిందీ పేపర్ లీకేజీ పై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేపర్ లీక్ చేశానని, తనపై దొంగ కేసు నమోదు అయ్యిందన్నారు. మాథ్స్, సైన్స్ పేపర్ లీక్ చేసినా పేరు వచ్చేదని అనుకున్నట్లు సంచలన కామెంట్స్ చేశారు. హిందీ పేపర్ లీక్ చేస్తారా? ఎవరైనా అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బండి సంజయ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘బండికి హిందీ రాదు కాబట్టి తనే పేపర్ లీక్ చేశాడు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News