కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో బండి సంజయ్ భేటీ

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో గురువారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ

Update: 2024-07-04 15:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో గురువారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలపై గడ్కరీతో చర్చించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధి మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి(సీఆర్ఐఎఫ్) కింద నిధులు విడుదల చేయాలని బండి సంజయ్.. నితిన్ గడ్కరీని కోరారు.


Similar News