TTD Vs Telangana: టీటీడీ ఆదాయంలో వాటా అడుగుతున్న తెలంగాణ..! వాస్తవమెంత..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి దశాబ్దకాలం గడుస్తోంది.

Update: 2024-07-07 09:16 GMT

దిశ వెబ్ డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి దశాబ్ధకాలం గడుస్తోంది. అయినా నేటికీ ఇరు రాష్ట్రాల మధ్య లావాదేవీలు కొలిక్కిరాలేదు. విభజన ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ 10 ఏళ్లపాటు ఇరు రాష్ట్రాలకి రాజధానిగా ఉంటుంది. కాగా ఈ పదేళ్లలో ఏపీ నూతన రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. 10 ఏళ్లు తరువాత ఏపీకి హైదరాబాధ్‌పై ఎలాంటి హక్కులు ఉండవు.

ఈ ఒప్పదం ప్రకారమే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. అయితే అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ తన కంటూ ప్రత్యేక రాజధానిని నిర్మించుకోలేక పోయింది. దీనితో ప్రస్తుతం దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. ఓవైపు రాజధాని లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ మొగ్గు చూపట్లేదు, మరో వైపు రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందని, అలానే గతంలో ఇరురాష్ట్రాల మధ్య లావాదేవీలపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినా అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదని విశ్లేషలకు పేర్కొంటున్నారు.

 

అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నిన్న తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా ఈ శమావేశంలో ఇరు రాష్ట్రల మధ్య ఉన్న లావాదేవీల గురించి చర్చించారని సమాచారం. అయితే నిన్న జరిగిన సమావేశంలో టీటీడీ ఆదాయంలో 40% వాటా తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని వైసీపీ అధినేత పేరుతో ఉన్న సోషల్ మీడియా మూఖలు ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ పోస్టులపై టీడీపీ ట్టిట్టర్ వేధికగా స్పంధించింది.

‘నిన్న జరిగిన సమావేశం, విభజన చట్టంలో ఉన్న హామీల మీద. గత 5 ఏళ్ళలో అప్పనంగా జగన్ రెడ్డి ఇచ్చేసిన ఏపి భవనాల మీద, విద్యుత్ బకాయిలపై పోరాటం చేస్తుంటే, సుప్రీం కోర్టులో జగన్ రెడ్డి కేసు వెనక్కు తీసుకుని ఏపికి నష్టం చేసిన దాని మీద, తన ఆస్తులు కాపాడుకోవటం కోసం జగన్ రెడ్డి తాకట్టు పెట్టిన 9, 10 వ షెడ్యూల్ ఆస్తుల పంపకం మీద.. తిరుమల ఆంధ్రులకి చెందిన ఆస్తి.

తిరుమల ఆస్తులు, ఆదాయం, పక్క రాష్ట్రం వాటా ఎందుకు అడుగుతుంది ? బుర్ర లేని బులుగు మీడియా, ఇలాంటి ఫేక్ వార్తలు ఆపితే మంచిది..’ అంటూ ఘాటుగా పొస్టులో రాసుకొచ్చింది. 


Similar News