చందమామ దక్షిణ రారాజులం మనమే: Bandi Sanjay
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. చందమామ దక్షిణ రారాజులు భారతీయులేనని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రమండలంలోని దక్షిణ భాగంపై ల్యాండైన తొలి స్పేస్ క్రాఫ్ట్ భారత్ దేనని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నీ ప్రయోగించి విఫలమయ్యాయని, ఇటీవల రష్యా ప్రయోగించిన ఉపగ్రహం కూడా దక్షిణ ధృవానికి చేరుకోలేక విఫలమైందన్నారు. అత్యంత క్లిష్ట దశను కూడా విజయవంతంగా దాటి చందమామ దక్షిణ ధ్రువ రారాజుగా భారత్ అవతరించడం అద్భుతమని కొనియాడారు. గొప్ప అద్భుత విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో..
చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజవంతంగా ల్యాండ్ అవడం.. యావద్భారతం గర్వించే క్షణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చంద్రయాన్-3 ల్యాండింగ్ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం.. పార్టీ కార్యాలయంలో నాయకులు త్రివర్ణపతాకాలతో నినాదాలు చేశారు. అనంతరం మిఠాయిలు పుంచుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రయాన్ 3 విజయవంతంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షాతిరేకాలు తెలియజేశారు. ఇది భారతదేశానికి గర్వకారణమని డీకే అరుణ అన్నారు. రాబోయే ప్రయోగాల్లోనూ ఇస్రో భారత దేశ కీర్తిని మరింతగా ఇనుమడింపచేస్తుందని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More..
చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు
యావత్ దేశ ప్రజలకు ఇది పండుగ రోజు: ఇస్రోకు సీఎం KCR అభినందనలు