తెలంగాణ ఖజానాకు వేల కోట్ల నష్టం: బక్క జడ్సన్

తెలంగాణ సర్కారు ఖజానాకు వేల కోట్లకు పైనే నష్టం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-05-04 12:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కారు ఖజానాకు వేల కోట్లకు పైనే నష్టం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ఖజానాకు రూ.15 వేల కోట్లకు పైనే నష్టం జరిగిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌‌ను తక్కువ మొత్తానికే కట్టబెట్టడంపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో సగానికి సగం తగ్గుతున్నా ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు.

మహారాష్ట్రలో తక్కువ దూరం, తక్కువ కాలానికి ఎక్కువ మొత్తం చెల్లించి పది ఏళ్లు లీజ్ దక్కించుకున్న ఐఆర్‌‌బీ కంపెనీకి.. తెలంగాణ ఓఆర్ఆర్ ఎక్కువ దూరం ఉన్నా, ఎక్కువ కాలానికి.. తక్కువ మొత్తానికే రాష్ట్ర సర్కారు అప్పగించేసిందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పదేళ్లకు 8,875 కోట్లు అప్పజెప్పితే, తెలంగాణ ప్రభుత్వం 30 ఏళ్లకు కేవలం 7,380 కోట్లకే అప్పగించిందని దీనిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 30 ఏళ్లు కాలపరిమితి ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందనే దానిపై ఉన్నతాధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వెనుక భారీ గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.

Tags:    

Similar News