ప్రేమికులకు బిగ్ అలర్ట్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బజరంగ్ దళ్, శివసేన

వాలెంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ హెచ్చరించింది.

Update: 2024-02-13 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వాలెంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ హెచ్చరించింది. విదేశీ విష సంస్కృతిని విడనాడి భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిద్దామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించి, విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పొరేట్ శక్తుల కుట్రలకు బలికావద్దని యువతకు సూచించారు.

దేశం కోసం.. ధర్మం కోసం పరితపించేలా ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. "ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని.. అమరవీరుల సంస్కరణ దినం" అని అభివర్ణించారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమ దోమ అంటే ఒప్పుకోమనీ.. వాలెంటైన్‌‌కి ఈ దేశానికి ఎలాంటి సంబంధం లేదని శివసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ అన్నారు.

Tags:    

Similar News