దాని కారణంగా గంటకు 19 మరణాలు.. ఇది తెలుసుకోక పోతే చాల ప్రమాదమంటున్న నిపుణులు..

భారత దేశంలో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతుండగా.. ఆ ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

Update: 2024-03-16 07:57 GMT

దిశ వెబ్ డెస్క్: భారత దేశంలో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతుండగా.. ఆ ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ముఖ్య కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ పోలీస్ అధికారి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నగరాల్లో ఈ ప్రమాదాలు ముఖ్యంగా జంక్షన్ల దగ్గర జరుగుతున్నాయని.. ఇందుకు కారణం యూ టర్న్ తీసుకునే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అని పేర్కొన్నారు. ఇక యూ టర్న్ తీసుకునేటప్పుడు 50 మీటర్ల ముందుగానే ఇడికేటర్ వేసి కుడి వైపుకు రావాలని తెలిపారు. అలానే ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూ టర్న్ తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఇక యూ టర్న్ తీసుకున్న వెంటనే అకస్మాత్తుగా ఎడమ వరుసలోకి మారకూడదని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటించి సురక్షితంగా గమ్యం చేరమని కోరారు. 

Tags:    

Similar News