రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తత.. ఓవైపు గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి

రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, బిల్లులు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చిస్తున్నారని సమాచారం.

Update: 2024-07-01 08:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, బిల్లులు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్‌తో కలిసి భోజనం చేయనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌లో ఉండగా.. మరోవైపు యువజన, విద్యార్థి సంఘాల నేతలు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు.

నీటి పరీక్ష రద్దు చేయాలని ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, వీజేఎస్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐపీఎస్‌యూ, పీవైఎల్, వైజేఎస్ యువజన, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీ వచ్చారు. వెంటనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News