Assembly: రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

శాసన సభ(Telangana Assembly Session) వేదికగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) శుభవార్త(Good News) చెప్పింది.

Update: 2024-12-21 05:31 GMT

దిశ, వెబ్ డెస్క్: శాసన సభ(Telangana Assembly Session) వేదికగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) శుభవార్త(Good News) చెప్పింది. ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసా(Raithu Bharosa) పథకాన్ని అమలు చేయనున్నామని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో రైతు భరోసా పై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు. ఈ చర్చలో భాగంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2017-18 లో రైతు బంధు(Raithu Bandhu) పథకాన్ని తీసుకొచ్చి, ఒక సీజన్ కి ఎకరానికి 4 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిందని, 2018-19 లో ఈ మొత్తాన్ని 5 వేలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు.

పథకంలో పేర్కొన్న ప్రకారం భూమి సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలి కానీ ఈ పథకం అమలులో చాలా వ్యత్యాసం కనబడుతుందన్నారు. ఇది సక్రమంగా అమలు చేసేందుకు విదివిదానాలను నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) వేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ అనేక మంది నిపుణులు, రైతుల సలహాలు సూచనలు తీసుకొని విధివిధానాలను తయారు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం జనవరి అమలు చేయ తలపెట్టిన ఈ పథకానికి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి, వీటన్నింటినీ క్రోడీకరించి తుది విధివిధానాలు నిర్ణయించి, సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News