Assembly: 51 పంచాయితీలు మున్సిపాలిటీల్లో విలీనం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిథిలోని 51 పంచాయితీలను(Villages) మున్సిపాలిటీల్లో(Municipality) విలీనం(Merger) చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు.

Update: 2024-12-21 09:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిథిలోని 51 పంచాయితీలను(Villages) మున్సిపాలిటీల్లో(Municipality) విలీనం(Merger) చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. తెలంగాణ శాసన సభ(Telangana Legislative Assembly), మండలి సమావేశాలు(Council Meetings) రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మండలిలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మండలిలో పొన్నం మాట్లాడుతూ.. హైదరాబాద్(Hyderabad) సమీపంలోని ఓఆర్ఆర్(ORR) పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలను పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండి పట్టణ లక్షణాలు ఉన్న గ్రామాలను సమీపంలో ఉన్న మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పోరేషన్(Municipal Corporation) లో విలీనం చేయడం జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 80 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు గా ,మున్సిపల్ కార్పొరేషన్ లుగా మార్చడం జరుగుతుందని చెప్పారు. అంతేగాక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ ఎన్నికలు జరపడానికి డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ట్రిబ్యునల్(State Election Commission Tribunal) సవరణ మేరకు పంచాయతీ రాజ్ చట్టం షెడ్యూల్ 8 లోని 140 పంచాయతీల సవరణ చేయడం జరిగిందని మంత్రి తెలియజేశారు.

Tags:    

Similar News