‘ఆ 12 మంది వెనక్కి తీసుకురండి’.. కేంద్రానికి అసదుద్దీన్ ఒవైసీ కీలక విజ్ఞప్తి

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. విదేశంలో చిక్కుకుపోయిన 12 మంది భారతీయులను తిరిగి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్‌కు రిక్వెస్ట్ చేశారు.

Update: 2024-02-21 13:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. విదేశంలో చిక్కుకుపోయిన 12 మంది భారతీయులను తిరిగి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్‌కు రిక్వెస్ట్ చేశారు. స్థానిక ఏజెంట్ల చేతిలో మోసపోయి 12 మంది హైదరాబాద్ వాసులు ఉక్రెయిన్‌ దేశంలో చిక్కుపోయారని.. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావాలని ఓవైసీ కోరారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని.. తిరిగి దేశానికి వద్దామంటే వారిని అక్కడి ఏజెంట్లు మోసం చేశారని తెలిపారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 12 మంది హైదరాబాద్ వాసులకు తిరిగి భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్‌పై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరీ. గతంలో రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో ఆ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇరు దేశాలతో మాట్లాడి ప్రత్యేక విమానాల్లో భారతీయులను స్వదేశానికి తరలించారు.


Similar News