వివాదంలో Asaduddin Owaisi.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2023-01-07 05:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇది ఈసీ నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత జి నిరంజన్ లేఖ రాశారు. జనవరి ఐదో తేదిన ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే అసదుద్దీన్ కు ఇటు రాజేంద్ర నగర్ నియోజకవర్గంతో పాటు అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ ఒవైసీ పేరు మీద ఓటు నమోదై ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బాధ్యతాయుతమైన లోక్ సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని మండిపడుతోంది. వీఐపీల విషయంలోనే ఇలా వ్యవహరించడంపై ఎన్నికల యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టం అవుతోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు.

Also Read..

HYD: నగర వ్యాప్తంగా ఆరుచోట్ల ACB దాడులు

Tags:    

Similar News