కేసీఆర్ ఓటమికి కారణం అహంకారమే: అరవింద్ కుమార్ గౌడ్

అహంకారమే కేసీఆర్‌ను ఓడించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. గతంలో పనిచేసిన టీడీపీ

Update: 2024-07-06 14:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అహంకారమే కేసీఆర్‌ను ఓడించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. గతంలో పనిచేసిన టీడీపీ నాయకులకు తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం బాబుతో టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. గతంలో పార్టీని వీడిన అందరూ వచ్చిన ఆహ్వానిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్లో శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఏపీ మాదిరిగా ఎన్డీఏ కూటమి ఏర్పడితే కలిసి పని చేస్తామన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం అన్నారు. తెలంగాణ టీడీపీ పార్టీ నేతలు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అందరూ పార్టీ బలోపేతానికి సమన్వయంతో పని చేస్తున్నారని వెల్లడించారు. ఏం నిర్ణయం తీసుకున్న కలిసే తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చిన స్వాగతిస్తామన్నారు.

మొదటినుంచి పార్టీ కోసం పని చేసిన వారికే చంద్రబాబు బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ నేతలే వ్యతిరేకిస్తారని అభిప్రాయం వెల్లడించారు. బాబు ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తే అభినందిస్తామని.. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఒత్తిడి తెస్తామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీకి పార్టీ క్యాడర్ను సంసిద్ధం చేస్తామన్నారు. తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి ఏర్పడితే ఏపీ మాదిరిగానే తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పార్టీ మారాలనుకుంటున్న నేతలకు టీడీపీ ఏ ప్రత్యామ్నాయమని వెల్లడించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలను చంద్రబాబు వేయనున్నట్లు తెలిపారు.


Similar News