దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆర్మీ, నేవీలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన డేటా చౌర్యానికి గురైనట్టు స్పష్టమైన నేపథ్యంలో డిఫెన్స్ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా దృష్టిని సారించారు. గతంలో పాకిస్తాన్ నిఘా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ఇంటెలిజెన్స్కు చెందిన లేడీ ఏజెంట్లు మన జవాన్లను హనీట్రాప్చేసి రహస్యాలు సేకరించిన ఉదంతాలు ఉన్న నేపథ్యంలో డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆర్మీ, నేవీలకు చెందిన ఇంటెలిజెన్స్విభాగాలకు చెందిన సీనియర్ అధికారులను రంగంలోకి దింపారు. ఈ అధికారులు ఇప్పటికే సైబరాబాద్పోలీసులతో సమావేశమయ్యారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆర్మీ, నేవీ ఉద్యోగులకు సంబంధించిన డేటా వివరాలను తీసుకున్నారు. మరోవైపు పవర్సెక్టర్తోపాటు పలు కీలక ప్రభుత్వ శాఖల సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించినట్టు తేలిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ కూడా కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు సమాచారం.
లక్షల్లో ఆర్మీ, నేవీ ఉద్యోగుల డేటా..
సైబరాబాద్ పోలీసులు ఇటీవల నొయిడా కేంద్రంగా డేటా చౌర్యానికి పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి 16కోట్ల ఎనభై లక్షల మందికి సంబంధించిన పర్సనల్డేటాను స్వాధీనం చేసుకున్నారు. వీరిని జరిపిన విచారణలో ఆర్మీ, నేవీలకు చెందిన రెండున్నర లక్షల మంది ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి అమ్ముకున్నట్టుగా వెల్లడైంది. ఈ గ్యాంగును అరెస్టు చేసిన రెండు రోజులకే సైబరాబాద్పోలీసులు మరో తొమ్మదిమందిని కూడా సైబరాబాద్పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో వీళ్లు వెల్లడించిన వివరాల మేరకు హర్యానా రాష్ర్టం ఫరీదాబాద్కేంద్రంగా డేటా చౌర్యానికి పాల్పడుతున్న వినయ్ భరద్వాజ్‌ను అరెస్టు చేశారు. వినయ్ భరద్వాజ్ నుంచి 66 కోట్ల తొంభై లక్షల మంది డేటాను స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఆర్మీ, నేవీలకు చెందిన రెండు లక్షల యాభై వేలమంది ఉద్యోగుల పర్సనల్డేటా (పేర్లు, ఈ మెయిల్ఐడీలు, మొబల్నెంబర్లు) ఉన్నట్టుగా తేలింది. ఈ వివరాలు దేశ సరిహద్దులు దాటినట్టు అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఈ పరిణామమే రక్షణ శాఖలో కలవరం కలిగిస్తోంది.
హనీట్రాప్లే కారణం..
రక్షణ శాఖ ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతున్న ఈ ఆందోళనకు ప్రధాన కారణం గతంలో మన సైన్యంలోని కొందిరిని పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్సర్వీసెస్ఇంటెలిజెన్స్కు చెందిన మహిళా ఏజెంట్లు హనీట్రాప్‌లోకి లాగటమే. తమ ఉచ్ఛులో చిక్కిన వారి నుంచి మన దేశా సైన్యానికి సంబంధించిన రహస్యపత్రాలు, వ్యూహాత్మక ప్రాంతాల ఫోటోలు, ఆయా ప్రాంతాల్లో మోహరించిన ఆయుధాలు, సిబ్బంది వివరాలను తెలుసుకోవటమే. దీనికి నిదర్శనంగా గత సంవత్సరం పాకిస్తాన్లేడీ ఏజెంట్ల వలలో పడ్డ శాంతిమె రాణా (24) ఉదంతాన్ని పేర్కొనవచ్చు.
పశ్చిమబంగకు చెందిన రాణా జైపూర్‌లోని ఆర్టిలరీ యూనిట్లో జవానుగా పనిచేసేవాడు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు మహిళా ఏజెంట్లు గుర్నౌర్కౌర్అంకిత, నిషాలు (అసలు పేర్లు కావు) సోషల్‌మీడియా ద్వారా రాణాతో పరిచయం ఏర్పరుచుకున్నారు. తమదైన శైలిలో రాణాతో వాట్సాప్కాల్స్మాట్లాడి అతన్ని పూర్తిగా తమ ఉచ్ఛులో బిగించారు. ఆ తరువాత అతని అకౌంట్లో కొంత డబ్బును జమ చేసి రాణా పని చేస్తున్న రెజిమెంట్‌కు సంబంధించిన రహస్యపత్రాలు, ఫోటోలు, వీడియోలు తెప్పించుకున్నారు.
ఈ విషయం బయటపడటంతో ఉన్నతాధికారులు అధికారిక రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి రాణాను అరెస్టు చేశారు. అదే సంవత్సరంలో జోద్పూర్రెజిమెంట్లో పనిచేస్తున్న జవాన్ప్రదీప్కుమార్ (24)ను ఫేస్‌బుక్‌ద్వారా పరిచయం చేసుకున్న మరో పాకిస్తానీ లేడీ ఏజెంట్అతన్ని వలలోకి లాగి వాట్సాప్‌ద్వారా పలు రహస్యపత్రాలు, ఫోటోలు తీసుకున్నట్టు వెల్లడైంది. దాంతో ఆర్మీ అధికారులు ప్రదీప్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు.
ఇక, రూర్కీలోని మిలటరీ ఇంజనీరింగ్రెజిమెంట్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఇమాంఖాన్(34)ను ఇదేవిధంగా హనీట్రాప్‌లోకి లాగిన పాకిస్తానీ మహిళా ఏజెంట్ఒక్క నెలలోనే రెండు వందల వాట్సాప్మెసేజీల ద్వారా రహస్యపత్రాలను తీసుకుంది. ఈ వ్యవహారం బయటపడటంతో ఉన్నతాధికారులు ఇమాంఖాన్ను కూడా అరెస్టు చేశారు.
ఈ అనుభవాల నేపథ్యంలోనే..
ఈ క్రమంలోనే రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితుల నుంచి ఆర్మీ, నేవీ ఉద్యోగులకు సంబంధించిన డేటా విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు బలంగా ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇటు ఆర్మీ...అటు నేవీకి చెందిన ఇంటెలిజెన్స్విభాగాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే వీళ్లు సైబరాబాద్పోలీసులను నాలుగైదుసార్లు కలిసారు కూడా. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రక్షణ శాఖ ఉద్యోగుల డేటాను కూడా వీళ్లు తీసుకున్నట్టు సమాచారం.
ఈ డేటాలో 22 ఏళ్ల నుంచి 36 సంవత్సరాల మధ్య వయసున్న వారి వివరాలను వేరు చేస్తున్నట్టుగా సమాచారం. వీరికి సంబంధించిన మొబైల్ఫోన్ల కాల్‌డేటాతోపాటు వాట్సాప్ఛాటింగులు, కాల్స్, ఇతర సోషల్‌మీడియా యాప్‌ల ద్వారా ఎవరెవరితో మాట్లాడారు? అన్న వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు తెలియవచ్చింది.
ఈ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తే ఎవరికైనా హనీట్రాప్కాల్స్వచ్చాయా? వస్తే స్పందించారా? స్పందిస్తే ఎంతకాలం నుంచి హనీట్రాప్వ్యవహారం జరుగుతోంది? అన్న విషయాలు స్పష్టమవుతాయని భావిస్తున్నారు. ఈ వివరాలనుబట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక, డేటా చౌర్యానికి పాల్పడ్డ నిందితులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు చెందిన పలు కీలక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కూడా తస్కరించినట్టు స్పష్టమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యవహారంపై దృష్టిని సారించినట్టు సమాచారం. నిందితులను జరిపే విచారణలో వెల్లడైన వివరాలను ఎప్పటికప్పడు తమకు అందచేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే దర్యాప్తు అధికారులకు సూచించినట్టుగా తెలియవచ్చింది.