ఉద్యోగం విసుగొచ్చి వ్యవసాయంలోకి దిగుదాం అనుకుంటున్నారా..? మీకే ఈ శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది

Update: 2025-03-18 13:42 GMT
ఉద్యోగం విసుగొచ్చి వ్యవసాయంలోకి దిగుదాం అనుకుంటున్నారా..? మీకే ఈ శుభవార్త
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం అనే పేరుతో బృహత్తర పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 6 వేల కోట్ల రూపాయలను 5 లక్షల మందికి రాష్ట్రంలోని పలు కార్పోరేషన్ల ద్వారా లోన్ల రూపంలో అందించనుంది. ఈ పథకానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయ్యి.. దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభించింది. రాజీవ్ యువ వికాసం పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు నిరుద్యోగ యువకులను అర్హులుగా పేర్కొంది. ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 05 చివరి తేదీగా నిర్ణయించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా నిరుద్యోగులకు స్వయం ఉపాథి కల్పించేందుకు రూ. 4 లక్షల రూపాయలను యువత ఖాతాలో జమ చేయనుంది. దీనిలో కనీసం 60 -80 శాతం మేర సబ్సీడీ కూడా అందించాలని నిర్ణయించింది. ఇందులో వ్యవసాయానికి సంబంధించిన అంశాలను కూడా ప్రాతిపధికగా తీసుకొని రుణాలు మంజూరు చేయనుంది. దీంతో వ్యవసాయం చేయాలనుకునే నిరుద్యోగ యువకులకు ఇది ఒక చక్కటి అవకాశం కానుంది.

ఇందులో ఉన్న అంశాలు..

వ్యవసాయ అంశాలు..

  1. ఎద్దుల బండ్లు
  2. ఆయిల్ ఇంజిన్
  3. పంప్ సెట్
  4. ఎయిర్ కంప్రెషర్
  5. పత్తి సేకరణ యంత్రం
  6. వేరుషనగ మిషన్
  7. వర్మీ కంపోస్ట్
  8.  ఆయిల్ ఫామ్ పంట

పశుపోషణ

  1. గేదెలు
  2. ఆవులు
  3. డైరీ ఫారం
  4. కోడిగుడ్ల వ్యాపారం
  5. చేపల వ్యాపారం
  6. మేకల పెంపకం
  7. పాల వ్యాపారం
  8. పౌల్ట్రీ ఫారం
  9. గొర్రెల పెంపకం

ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు కావాల్సిన ధృవపత్రాలు

  1. ఆధార్
  2. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి 
  3. పాన్ కార్డు
  4. Passport ఫోటో
  5. లబ్ధిదారుడి ఫోన్ నంబర్

ముఖ్య సూచన : ఒక రేషన్ కార్డులోని సభ్యులలో ఒకరికి మాత్రమే అవకాశం కలదు.


Similar News