Apsara Murder Case : పోలీసుల విచారణలో షాకింగ్ ట్విస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Update: 2023-06-11 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణలో అప్సరకు గతంలోనే వివాహమైనట్లు తేలింది. భర్తతో విభేదాల కారణంగా అప్సర పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిసింది. జాతకం కోసం మొదట సాయికృష్ణ దగ్గరకు అప్సర వెళ్లింది. పూజల పేరుతో అప్సరకు సాయికృష్ణ దగ్గరయ్యాడు.

ఈ క్రమంలో వీరి మధ్య రిలేషన్ షిప్ ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. లేదంటే ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను బయటపెడతానని సాయికృష్ణను బెదిరించింది. అప్సర బెదిరింపులు ఎక్కువ కావడంతో సాయికృష్ణ అప్సర హత్యకు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే ఈనెల3న అప్సరను సాయికృష్ణ దారుణంగా హత్య చేశాడు.   

Tags:    

Similar News

టైగర్స్ @ 42..