కాళేశ్వరం పై అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రతినిధుల ప్రశంసలు

అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రతినిధులు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం పైన ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని నేవెడాలో జరిగిన ప్రపంచ ఎన్విరాన్మెంటల్ మరియు వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ సమావేశంలో

Update: 2023-05-23 14:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రతినిధులు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం పైన ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని నేవెడాలో జరిగిన ప్రపంచ ఎన్విరాన్మెంటల్ మరియు వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రాజెక్టు సందర్శించిన సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ తదుపరి ప్రెసిడెంట్ షిరిల్ క్లార్క్ కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతం అని కితాబు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లోని వచ్చిన మార్పు గొప్పదన్నారు. ఒక హైడ్రాలిక్ ఇంజనీర్ గా వాటర్ ను 500 మీటర్ల సముద్రమట్టానికి పైగా తీసుకురావడం ఊహకు అందని గొప్ప ఆలోచన అన్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ డైరెక్టర్ బ్రయాన్ పర్సన్స్ కాలేశ్వరం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాగునీటిని సంతృప్త స్థాయికి ఉపయోగించుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాలు అని, తెలంగాణ ఈ దిశగా ఒక గొప్ప ఉదాహరణగా ఇతర దేశాలకు నిలిచిందన్నారు. సొసైటీ అధ్యక్షురాలు లెమన్ మాట్లాడుతూ తమ సంస్థ కాళేశ్వరం లాంటి వినూత్నమైన, అద్భుత ప్రాజెక్టులను ప్రపంచానికి పరిచయం చేయడం తమ ఉద్దేశం అన్నారు. ఈ దిశగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుభవాలను వీడియోలు మరియు ఇతర రూపాల్లో ప్రపంచానికి చాటుతామన్నారు. తన విద్యార్థులకు కాలేశ్వరం ప్రాజెక్టు అనుభవాలను, ప్రాజెక్టు డిజైన్, మరియు నిర్మాణం వంటి అంశాల పైన వారికి వివరాలు అందిస్తామని అన్నారు. ప్రాజెక్టు గురించి ప్రశంసలు కురిపించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రతినిధులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News