ఆరుగురు BJP స్పోక్స్ పర్సన్ల నియామకం
బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొత్తగా ఆరుగురు స్పోక్స్ పర్సన్లను నియమించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొత్తగా ఆరుగురు స్పోక్స్ పర్సన్లను నియమించింది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరుగురు రాష్ట్ర అధికార ప్రతినిధులను, మీడియా మేనేజ్మెంట్కు నలుగురిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అధికార ప్రతినిదులుగా రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, సారంగుల అమర్ నాథ్, కల్యాణ్ నాయక్, సోలంకి శ్రీనివాస్ నాయక్, గడ్డం విజయ సునీత, వెంకట్ రెడ్డిని నియమించారు. మీడియా మేనేజ్ మెంట్ బాధ్యతలను సినీ ఆర్టిస్ట్ కస్తూరి, విజిత్ కుమార్, సుంకర మౌనిక, రాణా ప్రతాప్‌కు అప్పగించారు.