ఆ టైమ్ రానే వచ్చేసింది.. నిరుద్యోగులారా అలర్ట్: TSPSC Group 1 Notification 2022

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ తీపికబురు అందించింది.

Update: 2022-05-02 02:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ తీపికబురు అందించింది. 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఐదు రోజుల క్రితం పోలీసు పోస్టులు, గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, వాటిని అప్లై చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. గ్రూప్‌-1, పోలీస్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ సోమవారం (ఈరోజు) నుంచి ప్రారంభంకానుంది. పోలీస్‌ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకునే వారు తెలంగాణ పోలీస్‌ వెబ్‌ సైట్‌‌కు వెళ్లి అప్లై చేసుకోవాలి. దానికి ముందు అప్లికేషన్, డిటేయిల్స్‌ను సరిగా పరిశీలించిన తర్వాత అప్లై చేయాలి.

ఇక గ్రూప్-I రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు TSPSC వెబ్‌సైట్ www.tspsc.gov.inని సందర్శించి, సూచించిన ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌లో భాగంగా OTR నుండి డేటా తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. గ్రూప్ వన్‌కి దరఖాస్తు చేసుకోవాలంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి.


Similar News