ఏపీ కూటమి ఫార్ములాయే తెలంగాణలో ఇంప్లిమెంట్.. చంద్రబాబు మరో సంచలన స్కెచ్!

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-07-13 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తూ అలయెన్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. కాగా, తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాను వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఇప్పటికీ కేడర్, ఓటు బ్యాంకు ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే టీడీపీ పోటీకి దూరంగా ఉంది. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తున్న చంద్రబాబు బీజేపీ, జనసేన అలయెన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 14 శాతం ఉన్న ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగింది. మెజార్టీ స్థానాల్లో కాషాయ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్‌తో పాటు, ఖమ్మం జిల్లాలో గట్టి పట్టు ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీ ఫార్ములాను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి సానుకూల ఫలితాలు సాధించాలని చూస్తోంది. అందులో భాగంగా పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను నారా బ్రాహ్మణికి అప్పగించాలని సీబీఎన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ ఇంపాక్ట్‌ టార్గెట్..!

ఏపీలో గేమ్ ఛేంజర్‌గా మారిన జనసేన చీఫ్ 21కి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ పోటీ చేసిన స్థానాలను గెలిచి 100 శాతం స్ట్రెయిక్ రేట్‌తో అందరి చూపును తనవైపునకు తిప్పుకున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కాగా పవన్ ఇమేజ్, పొలిటికల్ సినారియో తెలంగాణలో కూడా కూటమికి కలిసొస్తాయని బీజేపీ, టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే పోరు అని కాషాయ పార్టీ నేతలు చెబుతున్న ఈ తరుణంలో ఏపీ కూటమి ఫార్ములాను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల్లో బలోపేతం కావడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని బీజేపీ-జనసేన-టీడీపీ భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో సానుకూలత లేదని భావిస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వం వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో చక్రం తిప్పాలని భావిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో ఊపు మీద ఉన్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఇక్కడ కూడా పార్టీ యాక్టీవిటీ పెంచితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. 


Similar News