BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక నిర్ణయం.. నేడు ఆ డ్రెస్‌లో అసెంబ్లీకి

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ కొత్త ఆర్‌ఓఆర్‌(ROR) చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు.

Update: 2024-12-18 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ కొత్త ఆర్‌ఓఆర్‌(ROR) చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ROR 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణి పోర్టల్‌(Dharani Portal)ను భూమాతగా మార్చాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న ROR 2020 చట్టం రద్దు కానుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న బ్లాక్ డ్రెస్‌లో అసెంబ్లీకి వచ్చిన వారు.. ఇవాళ ఆటో డ్రైవర్ల యూనిఫామ్‌(Auto Drivers Uniform)లో సభకు రావాలని నిర్ణయించారు. అంతేకాదు.. అసెంబ్లీ భవనం వద్దకు ఆటోల్లో చేరుకోనున్నారు. సభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై వాయిదా తీర్మానాలు చేయనున్నారు.

Tags:    

Similar News