మహిళలకు మరో శుభవార్త.. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం మహిళలకు తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది.

Update: 2023-12-22 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం మహిళలకు తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) మహిళల సంక్షేమం కోసం స్వర్ణిమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద... వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా వ్యాపార యజమానులు, రైతులు, వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం టర్మ్ రుణాలను అందిస్తుంది. మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు లోన్‌ను ఇవ్వనుంది. కాగా దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. వారి వయస్సు 18 నుంచి 55 మధ్య ఉండాలి. అలాగే వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. 


Similar News