Harish Rao: కురుమూర్తి స్వామి మీద ఒట్టుపెట్టి మాట తప్పారు.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు కౌంటర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల కొంగుబంగారమైన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి (Kurumurthy Venkateshwara Swamy) మీద ఒట్టేసి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట తప్పారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కామెంట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల కొంగుబంగారమైన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి (Kurumurthy Venkateshwara Swamy) మీద ఒట్టేసి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట తప్పారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కామెంట్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కురుమూర్తి స్వామి (Kurumurthy Swamy) సాక్షిగా సీఎం రేవంత్ (CM Revanth) మాట తప్పారని ఆయన ఆరోపించారు. వరంగల్ (Warangal) పర్యటనలో భాగంగా భాగంగా సీఎం తన 45 నిమిషాల ప్రసంగంలో 55 సార్లు కేసీఆర్ (KCR)నే గుర్తుకు తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్ (KCR) అంటే రేవంత్ (Revanth)కు భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. సీఎం(CM)కు తిట్లు, ఒట్టు తప్ప ఏమీ రావని తెలిపారు. 11 నెలల పాలనలో కాంగ్రెస్ (Congress Government) ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందని ఏమీ లేదని హరీశ్‌రావు అన్నారు.