Revanth: ఎక్కడ తిరిగినా ఊచలు లెక్కబెట్టడం ఖాయం.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
కేటీఆర్(KTR) ఎక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్(KTR) ఎక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. వేములవాడ(Vemulawada) సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై(BRS Leaders) విమర్శల వర్షం గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గం మీద కేసీఆర్(KCR) కు ఎందుకు అంత కక్ష అని, తానేమి లక్ష ఎకరాలు సేకరిస్తానని అనలేదని చెప్పారు. తాను సేకరిస్తానన్నది 4 గ్రామాల్లో 1100 ఎకరాలు మాత్రమేనని, 1100 ఎకరాల సేకరణ ప్రపంచ సమస్య అయ్యిందా? అని మండిపడ్డారు. అలాగే కేటీఆర్ ఎక్కడెక్కడో తిరుగుతున్నారుని, ఢిల్లీ(Delhi)కి వెళ్లి నాపై ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు.
కేటీఆర్ ఎక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని, భూసేకరణపై కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెట్టడం ఖాయంమని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కేటీఆర్ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నానని, ఎంత దూరం ఉరుకుతారో తాను చూస్తానని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను తాము చేస్తున్నామని, అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు మైండ్ పోయిందని దుయ్యబట్టారు. గత పదేళ్లు బీఆర్ఎస్ సరిగ్గా పని చేసి ఉంటే రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని, కేసీఆర్ వల్ల రైతుల ఆత్మహత్యల్లో(Farmers Suicides) రాష్ట్రం దేశంలోనే రెండో స్థానం(Second Place)లో ఉందని చెప్పారు. ఇక 11 వెల కోట్ల రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారని, తాము 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.