తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. 1000 ఉద్యోగాలు వచ్చే ఛాన్స్!
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. రంగారెడ్డి జిల్లా చందన్వల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. రంగారెడ్డి జిల్లా చందన్వల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ పెట్టుబడి ద్వారా సుమారు 1000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కంపెనీ ద్వారా సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్, ఇతర పరికరాలను తయారు చేయనున్నారు.
ఈనెల 28 తేదీన ప్లాంట్ శంఖుస్థాపన కార్యక్రమం జరగనున్నది. వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా, మంత్రి కే.తారక రామారావు ఈ కార్యక్రమానికి హజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరించనున్నడం పట్ల మంత్రి కే.తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. కంపెనీకి అన్ని రకాల సహాయసహకాలు అందిస్తామని తెలిపారు.