వైఎస్ వివేకా హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్
తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం వెలువడిన తరువాతే సీబీఐ విచారణకు హాజరవుతానని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వైఎస్ వివేకా హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం వెలువడిన తరువాతే సీబీఐ విచారణకు హాజరవుతానని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను అక్రమంగా ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసుతో సంబంధం లేకున్నా తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. వివేకానంద కూతురు సునీత, స్థానిక ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఒక కుట్ర ప్రకారం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అసలు కారణాలను వదిలేసి కేసులో నిందితునిగా ఉన్న దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ చేస్తోందని దుయ్యబట్టారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.