బ్రేకింగ్: బాబు మోహన్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి కొడుకు..!
అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి వరుస షాకులు తగులున్నాయి. వివిధ కారణాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి వంటి కీలక నేతలు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసి
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి వరుస షాకులు తగులున్నాయి. వివిధ కారణాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి వంటి కీలక నేతలు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరగా.. తాజాగా కమలానికి మరో షాక్ తగలింది. ఆందోల్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఉదయ్ బాబు కూమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. తండ్రి బాబు మోహన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేసి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఉదయ్ బాబు మోహన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ బాబు మోహన్ ఇవాళ గులాబీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్ని్కల్లో ఉదయ్ బాబు మోహన్ ఆందోల్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశపడ్డారు, కానీ అధిష్టానం మాత్రం ఆయనకు టికెట్ నిరాకరించింది. ఆందోల్ టికెట్‌ను తన తండ్రి, మాజీ మంత్రి బాబు మోహన్‌కే మరోసారి ఇచ్చింది. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఉదయ్ బాబు మోహన్ బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆందోల్‌లో పార్టీ కేడర్ సపోర్ట్ చేయక సతమతమవుతోన్న బాబు మోహన్‌కు.. కొడుకు ఉదయ్ బాబు పార్టీ వీడటం భారీ ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు.