Telangana Voters List : తెలంగాణ ఓటర్ల జాబితా ప్రకటన

తెలంగాణ(Telangana)లో పంచాయితీ ఎన్నికల(Panchayithi Elections)కు సర్వం సిద్ధం అవుతోంది.

Update: 2025-01-06 11:36 GMT
Telangana Voters List : తెలంగాణ ఓటర్ల జాబితా ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో పంచాయితీ ఎన్నికల(Panchayithi Elections)కు సర్వం సిద్ధం అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎన్నికల సంఘం(EC) అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓటర్ల జాబితా(Voters List)ను ప్రకటించింది ఎన్నికల సంఘం. ఈ జాబితాలో తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,35,27,925 ఉన్నారు. వీరిలో పురుషులు 1,66,41,489 ఉండగా, మహిళలు 1,68,67,735 ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నారు. అదేవిధంగా యువ ఓటర్లు 5,45,026 మంది ఉండగా.. సీనియర్ సిటిజన్లు 2,22,091, ఓవర్సీస్ 3,591 మంది, PWD లో 5,26,993 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎనికల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.      

Tags:    

Similar News