అమ్మమ్మ ఆవకాయ పచ్చడి! టీఎస్ఆర్టీసీ డెలివరీ సర్వీస్

ఎండాకాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొత్తావకాయ పచ్చడి. అమ్మమ్మ, నాయనమ్మలు, అమ్మలు ఎండాకాలం ఆవకాయ పచ్చడి పెట్టడం చూసే ఉంటారు.

Update: 2024-04-17 11:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎండాకాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొత్తావకాయ పచ్చడి. అమ్మమ్మ, నాయనమ్మలు, అమ్మలు ఎండాకాలం ఆవకాయ పచ్చడి పెట్టడం చూసే ఉంటారు. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఆ ఫీల్ అద్భుతంగా ఉంటుంది.

కానీ నేటి ఫాస్ట్ కల్చర్‌లో పచ్చళ్లు చేసుకోవడం తగ్గింది. ఎక్కువగా బయటే కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అమ్మమ్మ కిచెన్ ఆవకాయ పచ్చడిని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కడైనా 24 గంటల్లో డెలివరీ సర్వీస్ చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..