తెలంగాణ రైతులకు అమిత్ షా శుభవార్త
కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటి ఎస్సీ, ఎస్టీ పేదలను అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో మార్పు అన్నది బీజేపీ తోనే సాధ్యం అని స్పష్టం చేశారు. దీంతో పాటుగా తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పండిన ప్రతి పంటను తామే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అలాగే బాయిల్డ్ రైస్ కూడా కొంటామని కీలక హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు సహకరించకపోయినప్పటికి తమ పథకాలు తెలంగాణలో అమలు చేశామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దీంతో పాటుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కాలంలో రూ 2.5 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. అలాగే 900 కోట్ల రూపాయలు సమ్మక్క గిరిజన యూనివర్సిటీకి విడుదల చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నట్లైతే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అమిత్ షా కోరారు.