TPCC: సైకో రామ్‌కి కోటి అంటే వెయ్యి కోట్లు.. కేటీఆర్‌పై సామా రామ్మోహన్ సెటైర్

మాజీమంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) విమర్శల(Criticises) వర్షం కురిపిస్తున్నారు.

Update: 2025-01-04 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్:మాజీమంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) విమర్శల(Criticises) వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ట్వీట్ పెట్టారు. ఇందులో ఒక కోటికి బదులు వెయ్యి కోట్లు అని ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్ లీడర్లు స్పందిస్తూ.. కేటీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రిగా పని చేసిన వ్యక్తికి లెక్కల్లో ఇంత వీకా? అని సెటైర్లు(Satairs) వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) స్పందిస్తూ.. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. సైకో రామ్ కి కోటి అంటే వెయ్యి కోట్లు అని, పింకీలకి.. వర్డ్ డాక్యుమెంట్ అంటే ప్రభుత్వ డాక్యుమెంట్ అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సెటైర్ వేశారు. అంతేగాక ఎద్దుల్లాగ పెరిగిర్రు.. కోడికున్న బుర్రలేదు అని, మళ్లీ ఆ కాగితాలను పెట్టి కౌంటర్లు అని మీకు మీరే ఫీల్ అవుతున్నారని చెబుతూ.. చివరగా "సే నో టు డ్రగ్స్ కేటీఆర్" అని సామా రాసుకొచ్చారు.

Tags:    

Similar News