Minister Seethakka : రైతుబంధు పేరిట 22 వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన బీఆర్ఎస్ : మంత్రి సీతక్క
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రైతుబంధు(Rythu Bandhu) పేరిట 22వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా(Wasted)చేసిందని మంత్రి సీతక్క(Minister Seethakka) మండిపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్ : గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రైతుబంధు(Rythu Bandhu) పేరిట 22వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా(Wasted)చేసిందని మంత్రి సీతక్క(Minister Seethakka) మండిపడ్డారు. వేల ఎకరాలున్న ఆసామికి, రోడ్లకు కూడా రైతుబంధు ఇచ్చిందని తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసలైన రైతులకు మాత్రమే రైతుభరోసా సహాయం అందించాలనుకుంటుందన్నారు. షాద్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఏడాదికి ఒక్క చీర ఇచ్చి గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్నారు.
మేం ఇవ్వాళ మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని, బీఆర్ఎస్ వాళ్లు ఫామ్ హౌస్ లు కరెంటు పెట్టుకుని పేదింటి ఆడబిడ్డలకు 100యూనిట్ల ఉచిత విద్యుత్తు కూడా ఇవ్వలేదన్నారు. మేం 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 500లకే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి బీఆర్ఎస్ ఓర్వలేక అర్దంపర్థం లేని ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందనే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.