RS Praveen Kumar : మంత్రులకు కడుపు నిండితే చాలా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు(Appointments)ఇవ్వడానికి ప్రజాప్రభుత్వాని(State Government)కి, మంత్రుల(Ministers)కు సమయం(Time) దొరకడం లేదా? అంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎ

Update: 2025-01-04 11:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు(Appointments)ఇవ్వడానికి ప్రజాప్రభుత్వాని(State Government)కి, మంత్రుల(Ministers)కు సమయం(Time) దొరకడం లేదా? అంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎన్పీపీడీసీఎల్ లో జూనియర్ అసిస్టెంట్ , కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంచెం సమయాన్ని కేటాయించాలని కోరారు.

అలాగే జెన్ కో లో ఇంజనీర్లు, కెమిస్టులు నియామక పత్రాల కోసం మూడు నెలల నుండి రోజూ చకోర పక్షుల్లా బిక్షాటన చేస్తున్నారని, వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం లేదని.. వాళ్లేం పాపం చేసిండ్రని? ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా? అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా ముహూర్తాలు కావాలా? వాళ్లు ఉద్యోగాలు చేస్తే రోజు జీతం తీసుకుని వాళ్ల కుటుంబాల ఆకలి తీరుస్తారు కదా? అని, రూ.32000ల ప్లేటు మీల్స్ తో మీ మంత్రులకు కడుపు నిండితే చాలా అని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 

Tags:    

Similar News