దుస్తులు మార్చుకునే సమయం ఇవ్వరా..?: పోలీసుల తీరు టూమచ్ అన్న అల్లు అర్జున్
పోలీసులు దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని అల్లు అర్జున్ మండిపడ్డారు..
దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్పా-2 సినిమా(Pushpa-2 movie) రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిలాటలో మహిళ మృతి చెందారు. ఇందుకు సంబంధించి అల్లు అర్జున్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా అల్లు అర్జున్‌ను జూబ్లీహిల్స్(Jubilee Hills) నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్(Chikkadapally Police Station)కు తరలించారు.
అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. తన నివాసంలోకి అకస్మాత్తుగా పోలీసులు వచ్చారని తెలిపారు. డైరెక్ట్‌గా తన బెడ్ రూమ్ లోకి వచ్చారని, ఆ సమయంలో దుస్తులు మార్చుకునే సమయం ఇవ్వాలని తాను కోరినట్లు తెలిపారు. కానీ అందుకు పోలీసులు ఒప్పుకోలేదని, అరెస్ట్ చేస్తున్నామని చెప్పారని అల్లు అర్జున్ చెప్పారు. డైరెక్ట్ బెడ్ రూమ్‌లోకి పోలీసులు వచ్చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు తనను తీసుకెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అప్పటికప్పుడు రావాలని చెబితే ఎలా అని అల్లు అర్జున్ నిలదీశారు.
మరోవైపు అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఆయన అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు.