అభివృద్ధి అంతా అక్కడే: Kishan Reddy

తెలంగాణ ప్రభుత్వం అభివృద్దిని విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2022-12-21 06:51 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అభివృద్దిని విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేవలం కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీనే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. బస్తీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బస్తీల్లో వీధిలైట్లకు కూడా నిధులు కేటాయించడం లేదన్నారు. హైదరాబాద్ లోని అనేక బస్తీలు అధ్వాన్నంగా మారాయన్నారు. పేదలుండే బస్తీల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. 

Also Read....

మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించిన Bandi Sanjay 

Tags:    

Similar News