Aleti: అసెంబ్లీలో మాట్లాడాలంటే సీఎంకు జంకు!.. ఏళేటి సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీలో మా డిమాండ్ల నుంచి ఒక్కటి రెండు మాత్రమే చర్చకు వచ్చే అవకాశం ఉందని, తప్పించుకునేందుకు నాలుగు రోజులు అసెంబ్లీని రన్ చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-23 10:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో మా డిమాండ్ల నుంచి ఒక్కటి రెండు మాత్రమే చర్చకు వచ్చే అవకాశం ఉందని, తప్పించుకునేందుకు నాలుగు రోజులు అసెంబ్లీని రన్ చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవ్వాళ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం అసెంబ్లీ లో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని, ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు బయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారని, డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే డిస్కషన్ పెట్టారని ఆరోపించారు. 31 లోపు అప్రొప్రియేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు కూడా బీఆర్ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికమని విమర్శించారు.

తాము 18 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లామని, అందులో ఒక్కటి రెండు అంశాలే చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తమ అంశాల్లో వ్యవసాయం, ఇరిగేషన్, సాగు నీరు, ఉద్యోగాల ఖాళీలు, భర్తీ, మహిళల హామీ, విద్య రంగ సమస్యలు, పంచాయతీ రాజ్ శాఖ సమస్యలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు, పౌర సరఫరాల శాఖలో జరిగే అక్రమాలు, గృహ నిర్మాణ శాఖ, పెన్షన్లు, రెవిన్యూ శాఖ అవినీతీ ఇలా 18 రోజులు రోజుకి ఒక్క అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అవినీతి పునాదుల మీద నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఇక కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుల కలను సహకారం చేసేలా ఉందని, పేదల సంక్షేమానికి పెద్ద వేసేలా ఉందని అన్నారు. అలాగే ఇది విసినరీ బడ్జెట్ అంటూ.. యువతకు పెద్ద పీట వేసే బడ్జెట్ అని ఏళేటి అన్నారు. 

Tags:    

Similar News